![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "ఓ భామ అయ్యో రామ" మూవీ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇందులో సుహాస్, ఆలీ, సౌమ్య శారద వచ్చారు. ఈ సినిమా టీమ్ వాళ్ళు వచ్చారు సరే మరి నువ్వు వచ్చావేంటి అంటూ సుమ సౌమ్యని అడిగింది. ఈ సినిమాలో భామ క్యారెక్టర్ కి నన్ను అడిగారు అని చెప్పింది సౌమ్య. "ఓ బామ్మ క్యారెక్టర్ కి నిన్ను అడిగారా" అంటూ సుమ కౌంటర్ వేసింది. "ఆమె భామ కాదు నేను భామ" అంటూ ఆలీ చెప్పాడు. "ఇది నాకు మీతో సెకండ్ టైం కదా" అంటూ సౌమ్య అనేసరికి ఆలీ షాకై "ఏంటది" అని అడిగాడు.. "షూటింగ్ షూటింగ్" అని సౌమ్య చెప్పింది. అది చెప్పు ఆడియన్స్ కి అన్నాడు ఆలీ. "ఈ అమ్మాయి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని పదాలు వాడుతూ ఉంటుంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు అంటూ సుహాస్ కి చెప్పాడు ఆలీ.
వెంటనే సౌమ్య "నాకు తెలుగు రాదు అని ఇక్కడ అందరూ అవమానిస్తున్నారు..అందుకే ఇప్పుడు నేనే వాళ్ళను అనుభవిస్తున్నా" అని మాట్లాడేసరికి సుమ షాకైపోయింది. "ఈ సినిమాలో ఆలీ గారు నాకు మావయ్యగా నటిస్తున్నారు" అని సుహాస్ చెప్పాడు. వెంటనే సౌమ్య "ఏంటండీ ఇంత చిన్న ఏజ్ లో మావయ్య క్యారెక్టర్ ఇస్తున్నారు. ఆయనే హీరోలా ఉన్నారుగా" అనేసింది. ఆలీ తనని అన్నదా ఇంకా ఎవరినన్నా అన్నదా అని వెనకా ముందు చూసుకుంటూ ఉన్నాడు. "నేను అన్నది మిమ్మల్నే" అంది సౌమ్య. వెంటనే సుమ ఆలిగారు మీరు సౌమ్యతో ఒక పోడియంలో ఉండి గేమ్ ఆడండి...ఈరోజు మీకు ఉంది లెండి అంది..వెంటనే ఆలీ "ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఉంటది నాకు" అనేశాడు. దానికి సౌమ్య "అది రోజూ ఉంటది వదిలేయండి" అంది. జనరల్ గా అమ్మాయిలు క్రీం రాస్తారు కానీ ఈ అమ్మాయి ఏకంగా సున్నం రాసేస్తోంది అంటూ ఆలీ సౌమ్య మీద సెటైర్ వేసాడు.
![]() |
![]() |